సూర్య రోష్ని పండుగ లైటింగ్ కలక్షన్ ను ప్రారంభం

హైదరాబాద్‌ః తమ 50వ కార్యకలాపాల సంవత్సరంలో సూర్య రోష్ని లైటింగ్, ఫ్యాన్లు, గృహోపకరణాలు, స్టీల్ పైప్స్ మరియు పీవీసీ పైప్స్ లో భారతదేశపు అత్యంత గౌరవనీయమైన మరియు విశ్వసనీయమైన బ్రాండ్‌లలో ఒకటిగా పేరు పొందింది.
భారతదేశంలో లైటింగ్ ఉత్పత్తుల యొక్క అతి పెద్ద బ్రాండ్ తయారీదారుగా, సూర్య రోష్ని పరిశ్రమ ప్రమాణాన్ని స్థాపించడాన్ని కొనసాగిస్తోంది. గత శతాబ్దంలో సంప్రదాయ లైటింగ్ తయారీ శ్రేష్టతలో మరియు ఇప్పుడు ఈ శతాబ్దంలో ఆధునిక సాంకేతికతలో శక్తి ఆదా మరియు ఆధునిక ఎల్ఈడీ లైటింగ్ తయారీ శ్రేష్టతలో భారతదేశంలో గణనీయమైన పెట్టుబడి పెట్టిన బహుశా ఏకైక సంస్థ ఇది. గత 7 సంవత్సరాలలో, సూర్య రోష్ని ఎల్ఈడీ లైటింగ్ విజయవంతంగా దేశానికి అద్భుతమైన శక్తిని ఆదా చేసింది.
రాబోయే పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను తీసుకురావడానికి సూర్య మళ్లీ ఆర్అండ్‌డీలో పెట్టుబడి పెట్టింది. ప్లాటినా ఎల్ఈడీ బల్బ్, తన విస్తృత కాంతితో గదిలో ప్రతి మూలను ప్రకాశవంతం చేయడమే కాకుండా 25,000 గంటల (రేట్ చేయబడిన పరిస్థితులలో) ఉత్పత్తి జీవితంతో శక్తిని కూడా ఆదా చేస్తుంది. సరికొత్త శక్తి-సమర్థవంతమైన ప్లాటినా తో పాటు, అందమైన ఇండోర్ డెకరేషన్‌ల కోసం ప్రొఫైల్ స్ట్రిప్ లైట్, స్లిమ్ ట్రిమ్ & షైన్ ఎన్‌ఎక్స్‌టి డౌన్‌లైటర్ తో సహా ఇండోర్ మరియు అవుట్‌డోర్ లైటింగ్ ఉత్పత్తుల సమూహా్న్ని ప్రారంభిస్తున్నందుకు సూర్య గర్విస్తోంది; మిల మిల మెరిసే స్ట్రింగ్ లైట్ మరియు మెరిసే రోప్ లైట్, ఈ పండుగ సీజన్‌లో ఇంటి బయట చేసే అలంకరణలను సమాన స్థాయిలో ఉంచుతాయి.
కంపెనీ ఆవిష్కరణలను కొనసాగిస్తోంది మరియు బీఈఈ స్టార్ లేబుల్ ఫ్యాన్‌లను ప్రారంభించింది. ఇది ఒక్కొక్క ఫ్యాన్స్ నుండి సంవత్సరానికి రూ.1000 నుండి రూ.1800 వరకు ఆదా చేయడమే కాకుండా (రోజువారీ 16 గంటల వాడకం మరియు మరియు మెట్రో ఎనర్జీ టారిఫ్‌లు) ఇంటి అలంకరణను కూడా మెరుగు పరుస్తుంది.
కొత్త ఆఫరింగ్స్ లో రైస్ కుక్కర్ (ఇండికూక్), జ్యూసర్ మిక్సర్ గ్రైండర్స్ (ఆస్పైర్, గాలాక్సీ-ఐ), హెవీవెయిట్ డ్రై ఐరన్స్ (శక్తి ప్లస్, బోల్ట్), ఇన్‌ఫ్రారెడ్ మరియు ఇండక్షన్ కుక్‌టాప్స్, మరియు స్టోరేజ్ మరియు ఇన్‌స్టంట్ వాటర్ హీటర్స్ శ్రేణిలు (వేగవంతమైన, ఇన్‌స్టా హాట్ – 5.5లీ) భాగంగా ఉన్నాయి.
ఈ సందర్భంగా సూర్య రోష్ని, లైటింగ్ మరియు కన్స్యూమర్ డ్యూరబుల్స్ సీఈఓ – జితేంద్ర అగర్వాల్ ఇలా అన్నారు, “కలిసికట్టుగా చేసిన ప్రయత్నాలు, అంకితభావం మరియు ఆవిష్కరణలతో అనేక రకాల లైటింగ్ మరియు ఉపకరణాలు తయారు చేసిన సూర్య యొక్క అమోఘమైన బృందాన్ని నేను ఎంతో గర్వంగా అభినందిస్తున్నాను. ఇవి రాబోయే పండుగను ఆనందకరమైన సంబరంగా మారుస్తాయి.”
పండగల సందర్భాన్ని అర్థం చేసుకుని, కంపెనీ సమగ్రమైన 360-డిగ్రీల మార్కెటింగ్ వ్యూహాన్ని అవలంబించింది. ఈ విధానం విభిన్న సోషల్ మీడియా వ్యవస్థలు, రిటైల్ అవుట్‌లెట్స్ మరియు ఆన్-గ్రౌండ్ యాక్టివేషన్స్ లో ప్రచార చొరవల శ్రేణిని కలిగి ఉంటుంది. ఈ ప్రయత్నాలు కస్టమర్స్ మరియు ఛానెల్ భాగస్వాములు ఇరువురినీ ఒక అర్ధవంతమైన మార్గంలో నిమగ్నం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ప్రభుత్వ యొక్క పీఎల్ఐ పథకానికి అనుగుణంగా, కంపెనీ తమ టెక్నాలజీ ల్యాబ్‌లు మరియు తయారీ సౌకర్యాలలో 25 కోట్ల గణనీయమైన పెట్టుబడిని పెడుతోంది. ఈ వ్యూహాత్మకమైన చొరవ స్వావలంబన / ఆత్మనిర్భరతను కొనసాగించేందుకు, ప్రత్యామ్నాయాన్ని దిగుమతి చేసుకోవడానికి తోడ్పడుతుంది.
సూర్య రోష్ని లిమిటెడ్ గురించి
1973లో ఆరంభమైన నాటి నుండి, సూర్య రోష్ని తమ లైటింగ్ మరియు కంజ్యూమర్ డ్యూరబుల్స్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి మరియు స్టీల్ పైప్స్ మరియు స్ట్రిప్స్ వ్యాపారంలో తనదైన స్థానాన్ని రూపొందించిన సంస్థగా పరివర్తనం చెందింది. కంపెనీ 1973లో తమ స్టీల్ ట్యూబ్స్ తయారీ ఆరంభించింది, తదుపరి 1984లో లైటింగ్ లో, 2019లో పీవీసీ పైప్స్ లో మరియు 2014-15లో ఫ్యాన్స్, గృహోపకరణాలు వంటి కంజ్యూమర్ డ్యూరబుల్స్ లో అడుగు పెట్టడం ద్వారా వివిధ శాఖలుగా మారింది.
స్టీల్ పైప్స్ & స్ట్రిప్స్ వ్యాపారం విస్తృత శ్రేణి ఉత్పత్తులను తయారు చేస్తుంది మరియు భారతదేశంలో అతి పెద్ద జీఐ పైప్స్ తయారీదారు మరియు ఈఆర్‌డబ్ల్యూ పైప్స్ యొక్క అతి పెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. 2018లో (ప్రధానంగా ఆయిల్ & గ్యాస్ మరియు సీజీడీ రంగంలో) 3ఎల్‌పీఈ కోటింగ్ సదుపాయం యూనిట్ ఏర్పాటు మరియు ఏప్రిల్ 2022లో డైరక్ట్ ఫార్మింగ్ టెక్నాలజీ (డీఎఫ్‌టీ) తో వ్యాపారం మరింత శక్తివంతంగా మారింది. కాగా భారతదేశంలో అతి పెద్ద లైటింగ్ కంపెనీస్ లో ఒకటిగా, లైటింగ్ వ్యాపారం సంప్రదాయబద్ధమైన లైటింగ్ నుండి ఆధునిక ఎల్ఈడీ లైటింగ్ శ్రేణిని తయారు చేసింది. కంజ్యూమర్ డ్యూరబుల్ బిజినెస్ వివిధ రకాల ఫ్యాన్స్ మరియు గృహోపకరణాలను అందిస్తుంది.
‘సూర్య‘ బ్రాండ్ మరియు ‘ప్రకాష్ సూర్య‘ లకు భారతదేశంలో నాలుగు దశాబ్దాలకు పైగా బలమైన ఉనికి ఉంది. రూ.8000 కోట్ల ఆదాయంతో సూర్య తమ రెండు వ్యాపారాల్లో అనగా స్టీల్ పైప్స్ మరియు స్ట్రిప్స్ లో మరియు లైటింగ్ మరియు కంజ్యూమర్ డ్యూరబుల్స్ విస్తృత శ్రేణి డీలర్ నెట్‌వర్క్ తో దృఢమైన పాన్ ఇండియా ఉనికిని ఆనందిస్తోంది.