గుంటూరు లో జీవీఎల్ కు ఒక ఊహించని అనుభవం

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఒక ఊహించని అనుభవం ఎదురైంది. శనివారం మిర్చి ఎగుమతి దారుల అసోసియేషన్ కార్యాలయం ప్రారంభానికి గుంటూరుకు జీవీఎల్ వచ్చారు. కార్యాలయం ప్రారంభోత్సవం కోసం అసోసియేషన్ వారు ఒక ఆవును తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆవుకు నమస్కరించేందుకు వెళ్లగా..ఆ ఆవు జీవీఎల్ తన్నపోయింది. అయితే పెద్దగా దెబ్బ ఏమీ తగల్లేదు. మరోసారి మొక్కేందుకు ప్రయత్నించగా అది మరోసారి కాలు లేపింది.

దీంతో, అక్కడున్న వారు ఆయనను పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న అసోసియేషన్ ప్రతినిధులు గోవు ఇలా జీవీఎల్ ను చూసి ఎందుకు ఉలిక్కిపడి తంతోందన్న దానిపై చర్చించుకోవడం కనిపించింది. ఈ సంఘటనపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఇది చాలా చిన్న సంఘటన అని.. ఆవు పెద్ద గుంపును చూసి భయపడి దాని కాలు విసిరి తన కుర్తాను పాడు చేసిందని వివరించారు. దాన్ని పొరపాటున దాడిగా అభివర్ణిస్తున్నారన్నారు. తనను నిందించినట్లయితే ఎటువంటి సమస్య లేదని.. దయచేసి పవిత్రమైన ఆవును నిందించవద్దని కోరారు.