హిట్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్

హిట్ చిత్రానికి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టింది. విశ్వక్ సేన్ హీరోగా , శైలేష్ కొల‌ను డైరక్షన్ లో 2020 లో క్రైం ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రిలీజ్ టైమ్ లోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్ 2’ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ సీక్వెల్ లో కూడా విశ్వక్ సేన్ హీరోగా ఉంటారని అనుకున్నారు కానీ విశ్వక్ బదులుగా అడివి శేష్ ను తీసుకున్నారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ లో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ..సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..

నైజాం 1.92 కోట్లు
సీడెడ్ 38 లక్షలు
ఉత్తరాంధ్ర 53 లక్షలు
ఈస్ట్ లో 29 లక్షలు
వెస్ట్ 19 లక్షలు
గుంటూరులో 33 లక్షలు
కృష్ణ లో 24 లక్షలు
నెల్లూరులో 15 లక్షలు.. ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 4.3 కోట్ల షేర్, 6.90 కోట్ల గ్రాస్ రాబట్టింది.

కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 45 లక్షల షేర్ రాగా ఓవర్సీస్ లో 1.95 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా 6.43 కోట్ల షేర్ కలెక్షన్స్ 11.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.