మరికాసేపట్లో హైదరాబాద్ కు అమిత్ షా రాక

నేడు తెలంగాణ‌లో కేంద్ర‌మంత్రి అమిత్‌షా ప‌ర్య‌టించ‌నున్నారు. ఢిల్లీ నుంచి ఆయ‌న ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న షా మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 2.45 గంటల వరకూ ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగే బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొననున్నారు.

రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలపై జనాలకు చేరేవేసేందుకు పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 4.25 వరకూ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు.