నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ కథనభేరి..హాజరుకానున్న కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించనుంది . ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరుకానున్నారు.

కేసీఆర్‌ కరీంనగర్‌ను సెంటిమెంట్‌గా భావిస్తారు. 2001లో ఎక్కడైతే తెలంగాణ ఉద్యమ బావుటాను ఎగురవేశారో ఇప్పుడు అక్కడి నుంచే పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. కలిసొచ్చిన ఎస్సారార్‌ కళాశాల మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు కదనభేరి సభ నిర్వహిస్తున్నారు. అధినేత కేసీఆర్‌ సహా పార్టీ అగ్రనాయకత్వం హాజరవుతుండగా, కళాశాల మైదానంలో సభా వేదికతోపాటు సభికుల కోసం ఏర్పాట్లు చేసారు. పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటూ.. కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కరీంనగర్ నుంచి కధన భేరి పేరుతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

కరీంనగర్‌, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్‌, మానకొండూర్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. లక్ష మందికి తక్కువ కాకుండా తరలించేందుకు అన్ని స్థాయిల్లో నాయకులు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుని జనాన్ని మోటివేట్‌ చేస్తున్నారు. సభా స్థలిలో ఏ ఒక్కలోటూ కనిపించకుండా పార్లమెంట్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, పార్టీ నాయకులు బాధ్యతలు పంచుకుని పనిచేసారు.