వైఎస్ఆర్సిపి తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదు

నెల్లూరు: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు వైఎస్ఆర్సిపి బాధితులతో సమావేశమయ్యారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతు జగన్ పులివెందుల పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా జరగదని… ఆయనను పులివెందులకు పంపేదాకా వెనుకాడబోమని చంద్రబాబు అన్నారు. వైఎస్ఆర్సిపి తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు. వైసీపీ నేతలు దాడులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెలను వేధించి చంపారని చంద్రబాబు స్పష్టం చేశారు. రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ను జీవితాంతం జైలులో పెట్టినా చాలదన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలను కాపాడామన్నారు. టిడిపి కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/