ఈ నెల 23న తెలంగాణ కు అమిత్ షా.

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. తెలంగాణ పర్యటన కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 23 తెలంగాణకు అమిత్ షా రానున్నారు. కర్ణాటక ఎన్నికలు వచ్చే నెలలో ముగియనున్న నేపథ్యంలో నెక్ట్స్ టార్గెట్ తెలంగాణపై బీజేపీ అధిష్టానం పెట్టింది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో 7 , 8 నెలల్లో తెలంగాణ ఎన్నికలు ఉండటంతో బీజేపీ మరింత దూకుడు పెంచుతోంది. అందులో భాగంగా ఈ నెల 23న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఈ రాజకీయ పర్యటనలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా కాషాయ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు చెప్పినట్లు… ఆ పార్టీలో ఎవరు చేరుతారు చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పొంగులేటిశ్రీనివాసరెడ్డి మరియు… కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి BRS పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వారు బిజెపిలో చేరుతారో లేదో ఈ నెల 23వ తేదీన తెలియాల్సి ఉంది. గత రెండు నెలలుగా అమిత్ షా తెలంగాణ టూర్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. కానీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న అమిత్ షా.. రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు టైమ్ కుదరలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత అమిత్ షా తెలంగాణ టూర్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.