కేసీఆర్ కీలక నిర్ణయం : పోలీస్ ఉద్యోగాలకు వ‌యోప‌రిమితి పెంపు

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..పోలీస్ ఉద్యోగాలకు వ‌యోప‌రిమితి పెంచారు. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియాలో వ‌యో ప‌రిమితి గురించి గ‌త కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ జ‌రుగుతుంది. వ‌యో ప‌రిమితిని పెంచాల‌ని ప‌లువురు నిరుద్యోగులు.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో పోలీస్ ఉద్యోగాలకు వ‌యోప‌రిమితి పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియాలో ప్ర‌స్తుతం ఉన్న దాని కంటే.. మూడేళ్ల ను పెంచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 వేల మంది నిరుద్యోగుల‌కు.. సీఎం కేసీఆర్ నిర్ణ‌యంతో లాభం చేకురే అవ‌కాశం ఉంది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భ‌ర్తీలో ఉండే ఇంట‌ర్వ్యూ ప‌ద్దతిని కూడా సీఎం కేసీఆర్ తొలగించారు.

పోలీసు శాఖలో వివిధ కేటగిరీల్లో 16,587 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా గ్రూప్‌–1లో డీఎస్పీ, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, రీజినల్‌ ట్రా న్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ విభాగాల్లో 120 ఉద్యోగాలున్నాయి.