జూన్ 16 నుండి ఏపి బడ్జెట్ సమావేశాలు

అమరావతి: ఏపి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవనున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశా నిర్వహణకు సంబంధించిన దస్త్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు పంపారు. గవర్నర్ ఆమోదం తర్వాత అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మార్చిలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇక, జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యలో.. 16 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 16న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక 18న ఏపి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/