ట్రాఫిక్ ఉంటేనే అంబులెన్స్‌ సైరన్‌: మణిపూర్‌ సర్కార్ ఆదేశాలు

ప్రజల్లో భయభ్రాంతులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

use ambulance siren in traffic only
use ambulance siren in traffic onlyuse ambulance siren in traffic only-Manipur Govt

Imphal : కరోనా తరుణంలో ప్రజల భయాందోళనను తగ్గించేందుకు అంబులెన్స్‌ల సైరన్‌ను నిలిపివేయాలని మణిపూర్‌ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల్లో భయభ్రాంతులను తొలగించేందుకు సామాజిక ఆందోళనకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ స్తంభించిన చోటే సైరన్‌ ఉపయోగించాలని సూచించారు. ఈ మేరకు జిల్లాల ముఖ్య వైద్యాధికారులకు, మెడికల్‌ సూపరింటెండెంట్‌లకు, ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులకు, అంబులెన్స్‌ ఆపరేటర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/