తెలంగాణలో సెంచరీకి చేరిన ప్రీమియం పెట్రోల్ ధర
ఐవోసీఎల్ ఎక్స్ట్రా ప్రీమియం లీటర్ ధర రూ.100.63

Hyderabad: ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా తెలంగాణలో ప్రీమియం పెట్రోల్ లీటర్ రూ.100 కు చేరింది. హైదరాబాద్ లో ఐవోసీఎల్ ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ లీటర్ ధర రూ.100.63కి చేరగా, హెచ్పీసీఎల్ పవర్ పెట్రోల్ ధర రూ.100.13, బీపీసీఎల్ స్పీడ్ పెట్రోల్ ధర రూ.99.09కి చేరింది.
కాగా సాధారణ పెట్రోల్ లీటరు ధర రూ.1.64 పెరిగి రూ.96.50కి చేరింది. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర రూ.1.93 పెరిగి రూ.91.04 అయింది. తాజాగా పెరిగిన ధరల కారణంగా తెలంగాణలో పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై సుమారు రూ.25 కోట్ల భారం పడినట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి మరోవైపు గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో పెట్రోల్, డీజిల్ వినియోగం బాగా పెరిగింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/