సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం

అడ్డుకున్న చెక్ పోస్ట్ సిబ్బంది

CM-Camp-Office-File

Tadepalli: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కృష్టా జిల్లాకు చెందిన నరేష్, సరస్వతి ఆర్థిక కష్టాలతో ఇబ్బందుల్లో ఉన్నారు. సీఎం జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కరోనా నేపథ్యంలో సీఎంను కలవడం కుదరదని పోలీసు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. వినతి పత్రం ఇస్తే సీఎంకు అందిస్తామని తెలిపారు. దీంతో ఆ భార్యాభర్తలు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చెక్‌పోస్టు సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కాగా ఫిట్స్‌తో ఇబ్బంది పడుతున్న బాధిత మహిళను తాడేపల్లి పీహెచ్ సి కి తరలించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/