దమ్ముంటే రా అంటూ బాలకృష్ణ కు అంబటి రాంబాబు సవాల్

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఫై ఏపీ అసెంబ్లీ లో గందరగోళం ఏర్పడింది. గురువారం సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే చంద్రబాబు అరెస్ట్‌ ను ఖండిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, పోడియం ను చుట్టుముట్టారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుండగానే..వారంతా చంద్రబాబు ఫై పెట్టిన అక్రమ కేసులు ఎత్తువేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, స్పీకర్ వద్దకు వెళ్ళి ప్లకార్డులు చూపించారు. ఈ క్రమ్మలో మీ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని స్పీకర్ కోరుతున్నప్పటికీ వారు వినకపోవడం తో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు.

ఈ సందర్భాంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులను రెచ్చగొట్టారు. దీంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పాడు. బాలకృష్ణ మీసం తిప్పడం ఫై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. మీరు సినిమాల్లో మీసం తిప్పండి ఇక్కడ కాదు..మాకు ఉన్నాయి మీసాలు, మీము కూడా తిప్పుతాం అంటూ రాంబాబు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో బాలయ్య హెచ్చరించడంతో దమ్ముంటే రా అంటూ అంబటి రాంబాబు సవాల్‌ విసిరారు.