టీడీపీ – జనసేన పార్టీ లకు పెట్రోల్ ధరలపై నిరసన తెలుపాలంటే భయం వేస్తుంది – అంబటి రాంబాబు

రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెంచేసరికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు..కానీ పెట్రోల్ , డీజిల్ ధరలు గత కొద్దీ రోజులుగా భారీగా పెరుగుతున్నప్పటికీ తెలుగుదేశం , జనసేన పార్టీ లు నోరుమెదపడం లేదని, నిరసనలు తెలుపడం లేదని ..ఎందుకంటే బిజెపి అంటే భయం అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం పెంచితే లోకేష్, పవన్ కళ్యాణ్ నోరు విప్పట్లేద‌ని .. పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల‌పై నిర‌స‌న‌లు చేయాలంటే భ‌య‌మేస్తోందా? అని ప్రశ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప‌వ‌ర్ స్టార్ అన్న బిరుదు ఉంద‌ని గుర్తు చేసిన అంబ‌టి.. ఇంధ‌న ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తూ కేంద్రంపై త‌న ప‌వ‌ర్ చూపించ‌వ‌చ్చు క‌దా అని సెటైర్లు వేశారు. ప‌నిలో ప‌నిగా రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల‌పైనా మాట్లాడిన అంబ‌టి.. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పరిణామాలతో విద్యుత్ ఛార్జీలు పెంచటం అనివార్యం అయ్యిందన్నారు.