ఆర్ఆర్ఆర్ ఫస్ట్ వీక్ రూ.710 కోట్లు కొల్లగొట్టింది

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘ఆర్​ఆర్​ఆర్​’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్​ను కొల్లగొడుతోంది. మార్చి 25న రిలీజైన ఈ సినిమా మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఏడురోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్లు గ్రాస్​ సాధించింది.

కేవలం హిందీలోనే రూ.132 కోట్ల (గ్రాస్) మార్కును దాటినట్లు ట్రేడ్​ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక, తమిళనాడులో సైతం మంచి వసూళ్లతోనే మొదటి వారాన్ని ముగించింది. కేరళలో స్టైక్​ వల్ల నాలుగో రోజు, ఐదో రోజు కలెక్షన్లపై ప్రభావం పడింది. అయితే ఆరు, ఏడో రోజు కలెక్షన్లు పర్వాలేదనిపించాయి. బాహుబలి 2 చిత్రం తరువాత ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ నిలిచింది.

ఏరియా వైజ్ గా కలెక్షన్స్ చూస్తే..

నైజాం – రూ. 77.22 కోట్లు
సీడెడ్​- రూ. 37.28కోట్లు
యూఏ-రూ. 20.97కోట్లు
ఈస్ట్​ గోదావరి- రూ. 11.16కోట్లు
వెస్ట్​ గోదావరి- రూ. 9.76కోట్లు
గుంటూరు- రూ. 14.03కోట్లు
కృష్ణ- రూ.10.78కోట్లు
నెల్లూరు- రూ.6.45కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం- రూ. 187.65కోట్లు షేర్​ ( రూ.279.50 కోట్ల గ్రాస్​)

కర్ణాటక- రూ.27.75కోట్లు
తమిళనాడు- రూ.25.30కోట్లు
కేరళ-రూ.8.00కోట్లు
హిందీ- రూ.65.60కోట్లు
రెస్ట్​ ఆఫ్​ ఇండియా-రూ. 5.10కోట్లు
ఓవర్సీస్​- రూ.73.45కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం- రూ.392.85కోట్లు షేర్​ (గ్రాస్​- 710కోట్లు).