ఐసిస్ సానుభూతిపరుడు సులేమాన్ అరెస్ట్
సోషల్ మీడియాలో పోస్టు ఫలితం

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఐసిస్ సానుభూతిపరుడు సులేమాన్ ను శనివారం అరెస్ట్ చేశారు. ఫలక్ నుమా కు చెందిన సులేమాన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సోషల్ మీడియాలో ఐసిస్ కు ప్రచారం చేయగా , ఆ తర్వాత పోలీసు అధికారులు రంగంలోకి దిగి ఐపీ అడ్రస్ ద్వారా ఆ పోస్ట్ పెట్టింది సులేమాన్ గా గుర్తించారు. కాగా, పాతబస్తీ ప్రాంతంలో సులేమాన్ ను ఇవాళ అరెస్టు చేశారు. తీవ్రవాదం వైపు యువత ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నాడని పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/