జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఎందుకు సైకిలే తీసుకుంటే పోలా ! – అంబటి

మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన గ్లాస్ గుర్తును కోల్పోయింది. ఎన్నికల సంఘం తొలగించిన తరువాత జనసైనికులు నిరాశ చెందారు. మరో నాల్గు , ఐదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ కి గాజు గ్లాస్ గుర్తు వస్తుందో రాదో అనే ఆందోళనలో శ్రేణులు ఉండగా.. కేంద్ర ఎన్నికల సంఘం పార్టీకి అదే గుర్తును కేటాయిస్తూ.. వారిలో సంతోషాన్ని నింపింది. దీనిపై జనసేన నేతలు ఈసీ కి థాంక్స్ చెప్పుకొన్నారు.

అయితే జనసేన కు గాజు గుర్తు మరోసారి ఈసీ ఇవ్వడం ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మళ్లీ గ్లాసు గుర్తు ఎందుకు… సైకిలే తీసుకుంటే పోలా! అని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ విధంగా స్పందించారు. అంబటి వ్యాఖ్యలకు సానుకూలంగా, ప్రతికూలంగా పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందిస్తున్నారు.