తెలంగాణలో అర్చ‌కుల‌కు గౌర‌వ‌భృతి రూ. 5 వేల‌కు పెంపు: సిఎం కెసిఆర్‌

The honorarium of Vedic scholars has been increased to Rs.5 thousand

హైదరాబాద్ః రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపనపల్లిలో సిఎం కెసిఆర్‌ బ్రహ్మణ సదన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. బ్రహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ఇస్తున్న భృతిని రూ. 2500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. భృతిని పొందే అర్హత వయస్సు 75 ఏళ్ల వయసు పరిమితి నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నామన్నారు. ఆలయాలకు ఇకపై అన్యువల్ గ్రాంట్ రూపంలో నిధులిస్తామని తెలిపారు. ఐఐటీ,ఐఏఎంలో చదివే బ్రాహ్మణ స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపజేస్తామన్నారు.

బ్రాహ్మణులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని సిఎం కెసిఆర్ అన్నారు. బ్రాహ్మణ సదనం నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. సూర్యపేటలోనూ త్వరలోనే సదనం భవనం ప్రారంభిస్తామని చెప్పారు. దూపదీప నైవేద్య పథకం 6441 ఆలయాలకు పెంచుతున్నామని చెప్పారు. బ్రహ్మణ పరిషత్ కు ఏడాదికి 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2017లో శేర్లింగంపల్లిలో బ్రహ్మణ సదనం భవనానికి శంకుస్థాపన చేశారు. 6 ఎకరాల 10 గుంటల స్థలం కేటాయించారు. 12 కోట్లు ఖర్చు చేసి భవనం నిర్మించారు.