ఈ నెల 14 న నల్లగొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన ..

టిఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వరుస పర్యటనలు , ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన లు చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఇక ఐటీ మంత్రి కేటీఆర్ సైతం ప్రతి రోజు పలు జిల్లాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ వస్తున్నారు. ఈ నెల 14 న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా హాలియా పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏర్పాట్లను బుధువారం పరిశీలించారు.
మిర్యాలగూడ రహదారిలో హెలీపాడ్, పట్టణంలోని మినీ స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, సభ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఆ తర్వాత నందికొండ పట్టణంలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల ఆవరణ, పెద్దవూర మండలం సుంకిశాలలో హెలీపాడ్ కోసం స్థల పరిశీలన చేశారు.