చంద్రబాబుని వదిలిపెట్టని CID ..మరో కేసు నమోదు

ఇప్పటికే చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జైల్లో పెట్టిన CID ..ఇప్పుడు మరో కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి సైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో రూ.121 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి

ఇప్పటికే పలువురిని విచారించింది. 2021లో ఫైబర్ నెట్ కుంభకోణంలో విచారణ సందర్బంగా 19 మందిపై సీఐడీ కేసు నమోదైంది. నాటి ఎఫ్ఐఆర్‌లో ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎంపీ సాంబశివరావు ఉన్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం విధితమే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. స్కిల్ కేసుకుతోడు ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డుపై పిటీ వారెంట్ వేసిన సీఐడీ అధికారులు. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు మోపింది. దీనిపై టిడిపి శ్రేణుల నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.