ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు..అమర్‌నాథ్‌ యాత్రకు ఆటంకం

amarnath-yatra-heavy-landslide-on-jammu-srinagar-highway

శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్‌లో భారీగా కురుస్తున్న వర్షాలు కారణంగా నేడు రాంబన్‌లోని మెహర్‌, కెఫెటేరియా మలుపుల వద్ద వానలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ – శ్రీనగర్‌ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పర్వత ప్రాంతాల నుంచి రాళ్లుపడిడుతుండడంతో అధికారులు అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి, భక్తులను చంద్రకోట్‌ బేస్‌ క్యాంప్‌కు తరలించారు. 1,147 మంది భక్తులతో కూడిన బ్యాచ్‌ను ఉదయం జమ్మూలోని భగవతినగర్‌ నుంచి బయలుదేరింది. రోడ్డుమార్గాన్ని పునరుద్ధరించిన అనంతరం ప్రయాణికులను పహల్గామ్‌, బల్తాల్‌కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/