భారత్‌కు అమెరికా ఆర్థిక సహాయం

యూఎస్‌ఏఐడీ ద్వారా అందిస్తున్నట్టు అమెరికా ప్రకటన

India , America
India , America

వాషింగ్టన్ : కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌కు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ‘స్థోమత ఆరోగ్య సంరక్షణ లభ్యత, దీర్ఘాయువు భాగస్వామ్య’ (పాహల్) ప్రాజెక్టుకు 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) సాయాన్ని అందజేస్తామని గురువారం ప్రకటించింది. కాగా యూఎస్‌ఏఐడీ ద్వారా 3 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఏప్రిల్ 16 న అమెరికా అధికారులు తెలిపారు. ‘పాహల్’ ప్రాజెక్టు ద్వారా జాతీయ ఆరోగ్య ఆథారిటీకి యూఎస్‌ఏఐడీ మద్దతు అందించనుంది. కరోనా చర్యల్లో భాగంగా భారత్‌ కు సహాయం చేయడానికి యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ) ఇప్పటివరకు 9 5.9 మిలియన్లను అందించింది. ఈ మొత్తం ఇండియాలో వైరస్‌ వ్యాప్తిని తగ్గించడానికి, బాధితులకు రక్షణ కల్పించడానికి, ప్రజలకు అవసరమైన ప్రజారోగ్య సందేశాలు జారవేయడానికి ఉపయోగిపడుతుంది. అలాగే, వైరస్‌ కేసుల గుర్తింపు, నిఘాను బలోపేతం చేయడానికి సహాయపడనుంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి;https://www.vaartha.com/news/business/