రెండో రోజు భారీగా పెరిగిన మేజర్ కలెక్షన్స్

అడివి శేషు హీరోగా నటించిన మేజర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. శేష్ ఈ మూవీ లో హీరోగా నటించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. శశి కిరణ్ తిక్క ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించగా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కలెక్షన్లు చూస్తే.. నైజాంలో రూ. 1.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 47 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.61 కోట్లు షేర్, రూ. 6.05 కోట్లు గ్రాస్ సాధించింది.

ఇక రెండు రోజుల్లో కలిపి..నైజాంలో రూ. 3.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 87 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 98 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 65 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 44 లక్షలు, గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 7.68 కోట్లు షేర్, రూ. 12.90 కోట్లు గ్రాస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.48 కోట్లు షేర్‌తో పాటు రూ. 25.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.