జనసేన కాదు.. జెండా సేనా – మంత్రి అమర్నాధ్

పవన్ కళ్యాణ్ జనసేన కాదు..జెండా సేనా అన్నారు వైస్సార్సీపీ మంత్రి అమర్ నాధ్. రాబోయే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం మరోసారి క్లారిటీ ఇచ్చారు. టీడీపీ తో పొత్తు ఖాయమని తేల్చి చెప్పడం తో..వైస్సార్సీపీ నేతలు పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ అని, కేవలం చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఈ పార్టీని పవన్ పెట్టాడని , పవన్ కళ్యాణ్ కూడా ఓట్ల కోసం రాజకీయం చేయడం బాగా నేర్చుకున్నాడని సెటైర్ వేయగా..మంత్రి అమర్ నాధ్ జనసేన పార్టీని నడపలేనని పవన్ చేతులెత్తేశారని హేళన చేశారు.

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదని, అది జెండా సేన పేర్కొన్నారు. ప్రతీసరి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీ జెండా మోయడమే పవన్ పని అని ఎద్దేవా చేసారు. జనసైనికులు ఇక నుంచి జెండా కూలీలు అని అమర్‌నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని, ప్యాకేజ్ స్టార్ అని మొదటి నుంచి చెపుతున్నామని , ఇప్పుడు అదే నిజమైందని, తాము చెబితే చెప్పులు చూపించిన పవన్.. ఇప్పుడేం చూపిస్తారని ప్రశ్నించారు. పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనేయడం అంత ఈజీ కాదని ఎద్దేవా చేశారు.