బరువు ఎప్పుడూ ఒకేలా..

ఆరోగ్య సంరక్షణ

ఎత్తుకు తగిన బరువే ఉన్నా ఎక్కడ బరువు పెరుగుతామో అనే ఆందోళనలో కొందరు ఉంటారు.. తగిన బరువున్నా దాన్ని పెరగకుండా ఉంచుకోవడం కూడా సవాలే.. కొన్నిఅలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చని అంటున్నారు నిపుణులు..


8 తర్వాత:
రాత్రి 8 తర్వాత ఆహారాన్ని తీసుకోకూడదు.. రాత్రి పూట శరీరం వ్యర్ధాలను తలాగించే ప్రయత్నంలో ఉంటుంది… ఆలాగే కొత్త కణాల ఉత్పత్తి జరుగుతుంది.. ఆ సమయానికి జీర్ణ వ్యవస్థ విధులు ముగించుకుని ఉంటేనే ఇవన్నీ వీలవుతాయి. అందుకే రాత్రి 8 గంటల లోపు భోజనం ముగిస్తే అది రెండు గంటలోపు జీర్ణమవుతుంది. అలా కాకుండా ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినటంతో జీవ క్రియలకు అంతరాయం కలుగుతుంది.. అధిక బరువు సమస్య ఎదురవుతుంది.

చక్కెర :
ఆహారంలో చక్కెరను తగ్గించు కోవాలి.. పోషక విలువలు, కెలోరీలు లేని చక్కర అధిక బరువుకు కారణం అవుతుంది.. ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్లు, పిజా, సమోసా, చిప్స్, కప్ నూడిల్స్ , వేపుళ్ళు, నూనె ఎక్కువగా ఉండే ఆహారానికి యెంత దూరంగా ఉంటే అంట మంచిది.. వీటిలో అధిక స్థాయి సోడియం, చక్కర, కొవ్వు వంటివి అనారోగ్యానికి దరి తీస్తాయి… శరీరం బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే ఈ నియమాన్ని తప్పక పాటించాలి. అలాగే వెజిటల్స్, రిఫైన్డ్ నూనెల వాడకానికి దూరంగా, వ్ ఉండటం మేలు… వీటికి బదులుగా నెయ్యి, ఆవనూనె, ఆలివ్ నూనె వంటివి ఎంచుకోవాలి.. శరీరానికి తగినంత నీరు అందేలా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసం, సూప్స్ వంటివి తీసుకుంటే మంచిది..

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/