ఆర్మీ వాహనంపై దాడి.. డ్రోన్లు, స్నిఫ‌ర్ డాగ్‌ల‌తో ఉగ్ర‌వాదుల కోసం భారీగా గాలింపు

Attack on Army vehicle in J-K’s Poonch: Massive search ops underway to trace terrorists

శ్రీనగర్‌ః జ‌మ్మూక‌శ్మ‌ర్‌లో పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహ‌నంపై ఉగ్ర‌వాదులు గ్రేనేడ్ దాడి చేసిన ఘ‌ట‌న‌లో అయిదుగురు జ‌వాన్లు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అయితే బాట‌-దోరియా ప్రాంతంలో ప్ర‌స్తుతం ఉగ్ర‌వాదుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు మొద‌లైంది. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ ప్రాంతాన్ని మొత్తం చ‌ట్టుముట్టేశారు. డ్రోన్లు, స్నిఫ‌ర్ శున‌కాల ద్వారా ఉగ్ర‌వాదుల కోసం గాలిస్తున్నారు. అదే ప్రాంతంలో దాక్కున్న ఉగ్ర‌వాదుల్ని ప‌ట్టుకోవాల‌న్న ఉద్దేశంతో సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నారు.

కాగా, రాజౌరి, పూంచ్ బోర్డ‌ర్ జిల్లాల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. గురువారం ఆర్మీ వాహ‌నంపై అటాక్ జ‌రిగిన త‌ర్వాత భింబేర్ గ‌లీ-పూంచ్ రోడ్డ‌పై ట్రాఫిక్‌ను ఆపేశారు. పూంచ్‌కు వెళ్లేవాళ్లు మెందార్ రూట్లో వెళ్లాల‌ని సూచించారు. కౌంట‌ర్ టెర్ర‌ర్ ఆప‌రేష‌న్స్ కోసం విధుల్లో ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్ బృంద సైనికులే ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన జాబితాల్లో హ‌వ‌ల్దార్ మ‌ణ్‌దీప్ సింగ్‌, లాన్స్ నాయ‌క్ దేబ‌శిశ్ భ‌స్వాల్‌, లాన్స్ నాయ‌క్ కుల్వంత్ సింగ్‌, సిపాయి హ‌రికిష‌న్ సింగ్‌, సిపాయి సేవ‌క్ సింగ్‌లు ఉన్నారు.