సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: అమరావతి రైతులు

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం 1,500 రోజులకు చేరుకుంది. అమరావతి పరిరక్షణే ఊపిరిగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమంలో రైతులు, మహిళలు, కూలీలు, వృద్ధులు సంకల్ప బలాన్ని కోల్పోలేదు. తమపై ఎన్నో కేసులను పెట్టినా వారు వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. దేశ చరిత్రలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రాంత ప్రజలు ఇంత సుదీర్ఘంగా ఉద్యమించడం ఇదే తొలిసారి.

ఉద్యమం 1500 రోజులకు చేరిన సందర్భంగా రాజధాని పరిధిలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లో రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ‘అమరావతిని జగన్ నాశనం చేయాలనుకున్నారు. భూములిచ్చిన రైతుల్ని ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఎంతో మంది చనిపోయారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం’ అని హెచ్చరించారు.