ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాది.. ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకండిః చంద్రబాబు

ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

chandrababu

అమరావతిః ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు ఉన్నవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. “మీ భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం మీకు కల్పించిన అవకాశం ఓటు హక్కు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు మిమ్మల్ని నడిపించేది, మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు.

రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు. మీ ఓటు తీసేస్తారు, లేదా మార్చేస్తారు. అప్రమత్తంగా ఉండండి. మీ ఓటు ఉన్నదీ, లేనిదీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఓటు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి. ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాది. కాబట్టి ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకండి” అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.