కరోనా వైరస్‌కు కారణం నేను కాదు..బిల్‌ గేట్స్‌

వ్యాక్సిన్ తో ప్రజలను చంపేందుకు కుట్ర అంటూ గేట్స్ పై ఆరోపణలు

bill gates
bill gates

అమెరికా: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారికి తానే కార‌ణ‌మంటూ వ‌స్తున్న కుట్ర‌పూరిత వ‌దంతుల‌పై మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి వెనుక బిల్ గేట్స్ కుట్ర ఉందని, కరోనా వ్యాక్సిన్ ద్వారా భూమిపై 15 శాతం ప్రజలను అంతమొందించాలన్నది ఆయన లక్ష్యమని ఓ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది. దీనిపై బిల్ గేట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను వ్యాక్సిన్ల ద్వారా ఎప్పుడైనా చంపామా? వ్యాక్సిన్ల ద్వారా మేం ఎప్పుడైనా డబ్బు కూడబెట్టామా? ఎవరైనా నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. వాస్తవానికి ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ల కోసం ఇతర ఎన్జీవోల కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నామని, అనేక వ్యాక్సిన్ల రూపకల్పనతో తమకు సంబంధం ఉన్న మాట నిజమే అయినా, వ్యాక్సిన్లతో ప్రజలను చంపాలని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు.


మరోవైపు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతుండగా, ఈ పరిశోధనలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/