మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న జగన్ సర్కార్

cm jagan

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకుంది. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ సోమవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఇదే అంశం పై కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు రాజధానులు విషయం పై చర్చ జరిగింది.

మూడు రాజధానులు బిల్లు ను ఉపసంహరించు కోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక దీనిపై మరికొన్ని నిమిషాల్లోనే సిఎం జగన్ అసెంబ్లీ లో ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని.. కొన్ని మార్పులతో కొత్తగా మళ్లీ సభలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతుందనే చర్చ కూడా జరుగుతోంది. దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయని, అందుకే 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని తెలిపారు.