గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హైకోర్టు అనుమతి

అమరావతి : గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు కొనసాగించాలని.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసింది. జవాబు పత్రాలు, మార్కుల వివరాలు కోర్టుకు ఇవ్వాలని.. ఇంటర్వ్యూ అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎంపిక ఉంటుందని.. అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/