150కి పైగా స్థానాల్లో కూటమి విజయం – రఘురామ

raghurama-approaches-high-court-seeking-cbi-probe-on-ycp-administration

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ 150 స్థానాలకు పైగా సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని టీడీపీ నేత రఘురామరాజు ధీమా వ్యక్తం చేసారు. రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు నా పుట్టినరోజు. ఈ రోజుతో వైసీపీకు మరణం..నాకు జననం.

రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో వైసీపీ పార్టీ ఇక కనిపించదు అని అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచీ ప్రజలు ఓటేసేందుకు తరలివచ్చారు. జగన్ చేసిన అన్యాయాలను గుర్తించిన మహిళలూ భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. జన స్పందనతో పోలింగ్‌ రోజు మధ్యాహ్నానికే వైసీపీ నాయకులు తిరుగుముఖం పట్టారు అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు 151. ఈ సంఖ్యలో ఎటువైపు ఉన్న ఒకటి పోతుందో తెలియదు. గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు.