టెన్త్ విద్యార్థులందరూ పాస్ ..

తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల

All 10th class students pass-TS govt GO
All 10th class students pass-TS govt GO

Hyderabad: రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో టెన్త్ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను (పాస్‌) చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎఫ్‌ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయిస్తూ ఈమేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలావుండగా కరోనా కేసుల కారణంగా టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. టెన్త్‌ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని, ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్‌ చేస్తామని స్పష్టం చేసింది. జూన్‌ రెండో వారంలో సమీక్షించి సెకండ్ ఇయర్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/