దేశంలో కరోనా విలయతాండవం
24గంటల్లో 3,29,942 కరోనా కేసులు

New Delhi: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. 24గంటల్లో దేశం వ్యాప్తంగా 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. 3,876 మంది మృతి చెందారు. కర్ణాటకలో 39,305, మహారాష్ట్రలో 37,236, తమిళనాడు 28,978, కేరళ 27,487 వెలుగుచూశాయి. తాజా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది. 2,49,992 మంది మృతి చెందారు.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/