సినిమా విలువ ఏంటో రాజకీయాల్లోకి వెళ్లాకే తెలిసొచ్చింది – చిరంజీవి

సినిమా విలువ ఏంటో రాజకీయాల్లోకి వెళ్లాకే తెలిసిందన్నారు మెగా స్టార్ చిరంజీవి. తాజాగా కేంద్రం చిరంజీవి కి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ను గోవా ఫిలిం ఫెస్టివల్ లో నిన్న చిరంజీవి అందుకున్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…తాను ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి సీని రంగంలో అడుగు పెట్టానని, నా తల్లిదండ్రులు శివశంకర్ ప్రసాద్ గా నాకు జన్మనిస్తే సినీ పరిశ్రమ మాత్రం చిరంజీవిగా జన్మనిచ్చిందని పేర్కొన్నారు. నాలుగున్నర దశాబ్దాల ప్రయాణంలో 10 ఏళ్లు సినిమాకు దూరంగా ఉన్నానని, అయినా నాపై ఇప్పటికీ అదే అభిమానం, ప్రేమ ప్రేక్షకులు చూపిస్తున్నారని అన్నారు. ప్రేక్షకుల హృదయాల్లో నా స్థానం పదిలం అని చెప్పిన ఆయన నాపై ప్రేమ గతంలో కంటే రెట్టింపు అయిందని అన్నారు.

అందుకే జీవితాంతం చిత్ర పరిశ్రమలో ఉంటానని తాను తెలుగు ప్రేక్షకుల ప్రేమకు దాసుడినని పేర్కొన్నారు. ఇక ఈ అవార్డు నన్ను గుర్తించి అందజేసిన ప్రధానమంత్రి మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్న ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమాలో విలువ ఏంటో తెలుసుకున్నానని ఏ రంగంలో అయినా అవినీతి ఉండవచ్చు కానీ సినీ పరిశ్రమలో అవినీతి లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు.