అత్యంత ఆప్తులు, సోదరుడిని కోల్పోయానుః చంద్రబాబు

chandrababu-naidu-condolence-to-mulayam-singh-yadav-death

అమరావతిః సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ మరణవార్త ఎంతో బాధ కలిగించిందని అన్నారు. తనకు అత్యంత ఆప్తులు, సోదరుడిని ఈ రోజు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘4 దశాబ్దాలుగా హుందా రాజకీయాలతో నన్ను ఎప్పుడూ ఆకట్టుకున్న నేత ములాయం. ఆయనతో కలిసి గతంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తన ఆలోచనల ద్వారా లక్షలాది మంది జీవితాలను మార్చిన నేత ములాయం. అఖిలేష్ యాదవ్ సహా కుటుంబ సభ్యులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/