ఇళ్లల్లోనే రంజాన్ ప్రార్థనలు: ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలను నిషేధిస్తూ ఉత్తర్వులు

Ramadan prayers at home
Ramadan prayers at home

Amaravati : రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవటంతో శుక్రవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్లల్లోనే ప్రార్ధనలు చేసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉండటం వలన నమాజ్ సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలిచ్చింది. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు విడతలుగా ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. మసీదుల్లో 50 మందికి మించకూడదంటూ పేర్కొంది.షేక్ హాండ్స్, ఆలింగనాలకు దూరంగా ఉండాలని తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం :: https://www.vaartha.com/telangana/