ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్..

సమ్మర్ వచ్చేసింది..చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి సొంతర్లకు వెళ్లడం..దురా ప్రాంతాలకు వెళ్లడం..పలు టూర్స్ ప్లాన్ చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలో TSRTC గుడ్ న్యూస్ తెలిపింది.. 8 రోజుల ముందుగానే బుకింగ్‌ చేసుకుంటే రిజర్వేషన్‌ ఫీజును మినహాయిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

ముందస్తు రిజర్వేషన్‌ కోసం http//tsrtconline.in వెబ్‌సైట్‌ని సంప్రదించాలని తెలిపారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, బీహెచ్‌ఈఎల్‌, నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రతి అరగంటకో బస్సు అందుబాటులో ఉంచుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ఇప్పుడే కాదు TSRTC నిత్యం ప్రయాణికుల కోసం అనేక ఆఫర్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటూ వస్తుంది.