అయోధ్య భూమిపూజ‌కు 250 మంది అతిథులు

ఆగస్టు 5న రామమందిర నిర్మాణం

‘bhoomi poojan’ ceremony of Ram

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీన భుమి పూజ జరుగనున్నట్లు సమాచారం. ఈ భూమి పూజ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడికి ఆహ్వానం పంపారు. ఆయ‌న హాజ‌రుకానున్నారు. ఆ రోజున ప్ర‌ధాని మోడి ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 వ‌ర‌కు అయోధ్య‌లో ఉంటారు. భూమి పూజ‌ల‌కు సంబంధించిన‌ య‌జ్ఞ‌, హోమాలు ఆ రోజున ఉద‌యం 8 గంట‌ల‌కే ప్రారంభంకానున్నాయి. కాశీ, వార‌ణాసి నుంచి వ‌చ్చిన పూజారుల చేత శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో 250 మంది అతిథులు పాల్గోనున్నారు. అయోధ్య‌లోని సాధువులు, రామాల‌య ఉద్య‌మంతో సంబంధం ఉన్న సీనియ‌ర్ నేత‌లంతా భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నారు.రాష్ట్రీయ స్వయంసేవ‌క్ సంఘ్‌, విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ఆఫీసు బియ‌ర‌ర్లను కూడా శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ ఆహ్వానించింది. కొంద‌రు సీనియ‌ర్ మంత్రులు, యూపీ మంత్రులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చాలా స్వ‌ల్ప సంఖ్య‌లో అతిథుల‌ను ఈ కార్య‌క్రమానికి ఆహ్వానిస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/