అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేస్తా – అలీ

చిత్రసీమలో కమెడియన్ గా , నటుడి గా , యాంకర్ గా ఇలా అన్ని కోణాల్లో అలరించిన అలీ..ప్రస్తుతం రాజకీయ నేత గా ప్రజలకు సేవ చేయాలనీ భావిస్తున్నాడు. గత ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీకి మద్దతు తెలిపి..ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా బాధ్యతలు చేస్తున్నాడు. మొన్నటి వరకు కూతురు పెళ్లి పనుల్లో బిజీ గా ఉన్న అలీ..ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ కావాలని అనుకుంటున్నాడు.

రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎక్కడి నుండి పోటీ చేయమన్న చేస్తానని , పార్టీ కోసం కష్టపడతానని తాజాగా మీడియా తో తెలిపారు. అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండే విధానంపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆ విషయం గురించి కూడా ఆలోచిస్తాను అని తెలియజేశాడు. మరి అలీ కి జగన్ ఎక్కడి నుండి పోటీ చేసే ఛాన్స్ ఇస్తారో చూడాలి.