సిఐ వేధిస్తున్నాడని మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం

సెల్ఫీ వీడియో ద్వారా ఆరోపణ

female home guard
female home guard

Kurnool District: సిఐ వేధిస్తున్నాడని మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. .సేకరించిన వివరాల ప్రకారం ఆదోనీ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో రామలక్ష్మీ అనే మహిళా హోంగార్డు విధులు పనిచేస్తున్నారు. అదే స్టేషన్‌లో సీఐ నరేష్ తనను కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీ వీడియో ద్వారా ఆరోపణ చేసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేసింది. శానిటైజర్ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు తెలిసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/