‘సెల్యూట్ ది కెప్టెన్’ అంటూ అకిరా పోస్ట్

పిఠాపురం లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన విజయం సాధించి సత్తా చాటింది. ఈరోజు కూటమి ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. కూటమి ఏర్పడడానికీ కారణమైన ఆయన…ఈరోజు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే ప్రతి ఒక్కరు ఆయన్ను ప్రశంసిస్తూ వస్తున్నారు. ఇక పిఠాపురం లో పవన్ గెలుపు ఫై ప్రతి ఒక్కరు స్పందిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా సైతం తన తండ్రి గెలుపు ఫై ట్వీట్ చేసారు. ‘సెల్యూట్ ది కెప్టెన్’ అంటూ పవన్ కళ్యాణ్ ఫొటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు అకీరా. ఈ ఫొటోను రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ “తన నాన్నపై అకీరా పోస్ట్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఇందులో అకీరా ఇన్‌స్టా ఐడీ కనిపించకుండా పేరును బ్లర్ చేశారు రేణూ. గతంలో కూతురు ఆద్య పోస్ట్‌ను కూడా ఇలానే షేర్ చేస్తూ ఐడీ కనిపించకుండా జాగ్రత్త పడ్జారు రేణూ. ఒక వేళ వీళ్ల ఇన్‌స్టా ఐడీలు తెలిస్తే ఫ్యాన్స్ భారీ ఎత్తున వీళ్లను ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీంతో వాళ్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని రేణూ దేశాయ్ భావించి ఉండొచ్చు. అందుకే వీళ్ల ఐడీలను రివీల్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.