కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ స్థానంలో ప్రధాన అభ్యర్థులుగా రాకేశ్ రెడ్డి(BRS), తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), అశోక్ (స్వతంత్ర) బరిలో ఉన్నారు.

నిన్న వెల్లడైన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో అని అంత ఎదురుచూస్తున్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్ ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. మహబూబ్‌నగర్ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.