బిగ్ బాస్ 5 : ఆ ఒక్క మాటే ఉమాదేవి ని బయటకు పంపింది

బిగ్ బాస్ 5 : ఆ ఒక్క మాటే ఉమాదేవి ని బయటకు పంపింది

బిగ్ బాస్ 5 సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. అంత అనుకున్నట్లే ఈ వారం హౌస్ నుండి ఉమాదేవి ఎలిమినేషన్ అయ్యింది. తొలి నుంచి చాలా అగ్రిసివ్‌గా ఉన్న ఉమ.. నామినేషన్స్ సందర్భంగా తిట్టిన బూతు చాలామందికి ఇబ్బందిగా అనిపించింది. అదే ఆమెను ఎలిమినేషన్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత ఆమెను బిగ్ బాస్ ఫుల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఆమెను చాలావరకూ పాజిటివ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. లోబోతో కొత్త లవ్ ట్రాక్ స్టార్ట్ చేశారు. అయితే నామినేషన్స్‌లోకి వచ్చిన తొలి రెండురోజుల్లోనే ఆమెకు నెగిటివ్‌గా చాలా ఓట్లు పడ్డాయి. ఈ రెండు మూడు రోజులు ఉమాదేవి అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

హౌస్‌లో ఉన్న చాలామందితో పోలిస్తే ఉమాదేవి బెటర్‌ అని, ఆమె కంటెంట్‌ ఇవ్వడంతో పాటు ఎంటర్‌టైన్‌ చేసిందని కామెంట్లు చేస్తున్నారు. మొదటి వారంలో అందరినీ బెదరగొట్టిన ఉమా, రెండో వారంలో మాత్రం తన రూటు మార్చుకుని లోబోతో కామెడీ చేస్తూ అదరగొట్టిందంటున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఆమె బిగ్ బాస్ హౌస్ ను వీడక తప్పలేదు.