‘ఏజెంట్’ ను అనిల్ సుంకర హోల్ సేల్ గా అమ్మేశారట..

Akhil Akkineni stilll From `Agent` Movie
akhil agent movie rights

‘ఏజెంట్’ చిత్రాన్ని నిర్మాత అనిల్ సుంకర హోల్ సేల్ గా అమ్మేశారట. అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టి చాలాకాలం అవుతున్న ఇంతవరకు అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు. అఖిల్ నటించిన గత చిత్రం మోస్ట్ బ్యాచ్లర్ సైతం యావరేజ్ తోనే సరిపెట్టుకుంది. దీంతో ఏజెంట్ మూవీ ఫై అందర్నీలో ఆశలు పెరిగాయి. ఈ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ , సాంగ్ ఇలా అన్ని కూడా సినిమా ఫై ఆసక్తి నింపాయి.

ఈ క్రమంలో ఈ చిత్రాన్ని నిర్మాత అనిల్ సుంకర హోల్ సేల్ అమ్మేసారట. వైజాగ్ కు చెందిన సతీష్ అనే డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 34 కోట్లు పెట్టి ఈ మూవీ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక హక్కుల్ని కూడా దక్కించుకున్నాడట. అయితే థియేట్రికల్ రైట్స్ కోసం చాలా మంది పోటీపడుతున్నా.. భారీ మొత్తానికే ఏరియాల వారిగా థియేట్రికల్ హక్కుల్ని అమ్మేసినా నిర్మాత ఈ మూవీని 15 కోట్ల డెఫిషీట్ తో రిలీజ్ చేస్తుండటం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మూవీ ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందా..అనేది చూడాలి.