హీరోగా మారిన రావు రమేష్..

ఇటీవల కాలంలో కథలో దమ్ము ఉండాలే కానీ హీరో ఎవరు ..? డైరెక్టర్ ఎవరు..? మిగతా కాస్ట్ & క్రూ ఎవరు..? ఎంత బడ్జెట్ పెట్టారనేది చూడడం లేదు. ఉదాహరణకు కాంతారా సినిమానే. కన్నడ లో సూపర్ హిట్ అయినా ఈ మూవీ తెలుగు లో డబ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాదు మిగతా భాషల్లోనూ భారీ విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో చాలా మంది నిర్మాతలకు ఓ క్లారిటీ వచ్చింది. కధలో దమ్ముంటే హీరోతో పనిలేదని డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పుడు కధలపై ఫోకస్ పెడుతున్నారు.

ఈ తరుణంలో సీనియర్ యాక్టర్ రావు రమేష్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. పీవీఆర్ సినిమా సంస్థ ప్రొడక్షన్ నెంబర్2 గా ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా, ఇంద్రజ కీలక పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. హ్యాపీ వెడ్డింగ్ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరించబోతున్నాడు. మరి ఈ సినిమా రావు రమేష్ కు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.