ఈ నెల 07 న ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్న జగన్

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ వరుస పర్యటనలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు. గత కొద్దీ రోజులుగా సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్న జగన్..ఈ నెల 5, 7వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు. దీనికి సంబదించిన వివరాలు మంత్రి అమర్ నాద్ మీడియా కు తెలియజేసారు.

మార్చి 5న విజన్ ఫర్ వైజాగ్ పేరుతో జరిగే సమావేశానికి పారిశ్రామిక వేత్తలు 2000 మంది హాజరు కాబోతున్నారు.. రానున్న రోజుల్లో వైజాగ్‌ను మరింతగా ఎలా అభివృద్ధి చేయనున్నారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించనన్నారని ఆయన వెల్లడించారు. రూ. 1500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు.ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లిలో వైయస్సార్ చేయూత సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రిలీజ్ చేయనున్నారు. అనంతరం అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.