నాగ చైతన్య ‘ కస్టడీ ‘ రిలీజ్ డేట్ ఫిక్స్

నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ కస్టడీ. ఈ మూవీ తాలూకా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో మే 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ పాత్ర లో కనిపిస్తుండగా.. కృతి ‘రేవతి’ పాత్రను పోషిస్తుంది.

ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ‘బంగార్రాజు’ తరువాత చైతూ – కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీ ఫై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ మూవీ ఈ ఇద్దరికీ చాల కీలకంగా మారింది. వీరిద్దరూ ప్రస్తుతం వరుస ప్లాప్స్ లో ఉన్నారు. దీంతో ఈ మూవీ ఫైనే వారితో పాటు , అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. చిట్టూరి శ్రీనివాస్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.