తెలంగాణలో బుధవారం విద్యా సంస్థలు బంద్‌..

తెలంగాణలో బుధవారం విద్యా సంస్థల బంద్‌ కు పిలుపునిచ్చాయి అఖిల భారత విద్యార్థి సంఘం (ఏబీవీపీ). ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల వసూలుకు వ్యతిరేకంగా ఏబీవీపీ గత కొద్దీ రోజులుగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో జూలై 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ విద్యా సంస్థలను మూసివేయించాయి. ఇక ఇప్పుడు తెలంగాణలో విద్యా రంగంలో జరుగుతోన్న అక్రమ ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా జులై 12వ తేదీన విద్యా సంస్థలు బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది.

తాజాగా ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు హైదరాబాద్‌లోని కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు రకాల అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ నాయకులు విమర్శించారు. విద్యా రంగానికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయడం లేదంటూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ ఆరోపించారు. విద్యా రంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిలంచాలని, స్కూల్‌ ఫీజులను తగ్గించాలనే డిమాండ్‌తో జులై 12వ తేదీ (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ బంద్‌ చేయాలంటూ పిలుపునిచ్చింది.