రాష్ట్రంలో 30న పోలీసు కానిస్టేబుల్ ఆఖరి రాత‌ప‌రీక్ష‌లు

telangana state police logo
final-written-exams-to-police-constable-posts-on-april-30

హైదరాబాద్ః రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. పోలీసు కానిస్టేబుల్ (సివిల్), పోలీసు కానిస్టేబుల్(ఐటీ అండ్ సీవో) ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ప‌రీక్ష‌ల తేదీల‌ను తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఖ‌రారు చేసింది. ఏప్రిల్ 30వ తేదీన‌ ఈ రాత‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. సివిల్ ఉద్యోగాల‌కు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను ఏప్రిల్ 24 తేదీ ఉద‌యం 8 గంట‌ల నుంచి 28వ తేదీ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసేప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే [email protected] కు మెయిల్‌ లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నది.